గ్రామీణ తపాలా బీమ.....
ఇస్తుంది ఆర్ధిక ధీమా....
దీనితో .......
అవుతుంది మీ జీవితం స్వర్గసీమ .....//గ్రామీణ//
కొద్దికొద్దిగా జమ చేసినచో
లక్షలు పొందే అవకాశం.........
అవసరమైనచో... అప్పుడప్పుడు...
అప్పును పొందే సదుపాయం...
కల్పించు అద్భుత బీమ...
ఇది....
గ్రామీణ తపాలా బీమ .....//గ్రామీణ//
బొట్టు బొట్టుగా ......చిందే నీ స్వేదం..
నీ వారికి నేడు రక్షణ కవచం..
ఆ స్వేదం ఆగిన సమయాన........
అవుతుంది తపాల బీమ -
నీ వారికి ... తోడూ... నీ డ.....//గ్రామీణ//
ఆపదలోన అండగా నిలచే -
ప్రియనేస్తం ఈ తపాల బీమ....
అలసిన వేళన బాధను మాపే -"అమ్మ ఒడి" ఐ తపాల బీమ....
గ్రామీణ తపాలా బీమ.........//గ్రామీణ//
రచన: టి.ఎ.వి. శర్మ, రీజియనల్ ఆఫీస్, కర్నూల్ -518002.